పంజాబ్‌లో 14 గ్రనేడ్ దాడులకు సూత్రధారిగా అనుమానిస్తోన్న గ్యాంగ్‌స్టర్ అమెరికాలో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హ్యాపీ పాసియాను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. గత నెలలో పంజాబ్‌లో మొత్తం 16 గ్రనేడ్ దాడులు జరిగాయి. ప్రార్థనా మందిరాలు, వీఐపీల ఇళ్లతోపాటు బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటిపై కూడా గ్రనేడ్ దాడులు జరిగాయి. వీటిని దర్యాప్తు చేసిన ఎన్ఐఏ పాసియాను సూత్రధారుడిగా గుర్తించాయి.
జనవరిలో ఎన్ఐఏ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందిన నలుగురిపై కేసులు నమోదు చేసింది. ఆ జాబితాలో పాసియా పేరు బయటకు వచ్చింది. పాక్‌కు చెందిన హర్వీందర్ సింగ్ సంధు ఆలియాస్ రెండా వీరిలో ఉన్నారు. గ్రనేడ్ దాడులకు రెండా, హ్యాపీ పాసియా సూత్రధారులని దర్యాప్తులో తేలింది. దాడుల చేసేందుకు రోహన్ మిషా, విశాల్ మిషాలను నియమించుకున్నారు. వీరు పంజాబ్‌లోని ఛండీగఢ్‌లో గ్రనేడ్ దాడులు చేశారు.
మాజీ పోలీసు అధికారి జేఎస్ చాహల్ ఇంటిపై దాడి కేసులో పాసియాపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ దాడులకు పాసియా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు సమకూర్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.