వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసినట్లు సమాచారం అందుతోంది. రూ.793 కోట్ల విలువైన 407 హెక్టార్ల సున్నపురాయి గనులను, మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేసినట్లు సమాచారం. జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి దాల్మియా సిమెంట్స్‌పై ఈడీ 2013లోనే అభియోగాలు మోపింది.
సుదీర్ఘ కాలం విచారణ తరవాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో దాల్మియా ఆస్తులు జప్తు చేసినట్లు తెలుస్తోంది. సున్నపు గనులు కట్టబెట్టేందుకు దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం నుంచి ప్రతిఫలంగా జగన్మోహన్రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. తమ వాటాలను అమ్మగా వచ్చిన డబ్బును హవాలా రూపంలో మరలా జగన్మోహన్రెడ్డికి బదిలీ చేసిందని ఈడీ అభియోగాలు మోపింది.