డ్రగ్స్ తనిఖీలు జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో హోటల్ గది నుంచి దూకి పారిపోయాడని తెలుస్తోంది. ఈ ఘటన కొచ్చిన్ నగరంలో జరిగింది. డ్రగ్స్ వినియోగంపై నార్కొటిక్ పోలీసులు దాడులకు వస్తున్నారనే సమాచారంతో హోటల్ మూడో అంతస్తులో ఉన్న నటుడు టామ్, రెండో ఫ్లోర్ లోకి దూకి మెట్ల మార్గం నుంచి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈ ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది.
సినిమా షూటింగుల్లో డ్రగ్స్ తీసుకుని తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ విన్సీ సోనీ అలోషిన్, టామ్ చాకోపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు, అమ్మ అసోసియేషన్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు కమిటీ వేయనున్నారు. వీరు సూత్రవ్యాక్యం అనే సినిమాలో నటించాు. తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి.