ఎస్సీ వర్గీకరణలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వర్గీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతకం చేశారు. గెజిట్‌ను న్యాయశాఖ విడుదల చేసింది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి దీనిపై ఉత్తర్వులిచ్చారు. మంగళవారంనాడు ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ ఆర్డీనెన్స్ జారీ చేశారు. దీంతో వర్గీకరణకు మార్గం సుగమం అయినట్లైంది.