ఉత్తరప్రదేశ్‌లోని రాంపుర్‌లో అరాచకం చోటు చేసుకుంది. పదకొండేళ్ల బధిర బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బధిర బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు మంగళవారం రాంపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు… పొలాల్లో నగ్నంగా గాయాలతో బాలిక కనిపించింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో దాన్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.