తిరుపతి ఎస్వీ గోశాలకు గుంపులుగా రావద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ పార్టీల నేతలు ఎస్వీ గోశాలను గుంపులుగా సందర్శిస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వందల గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు, కూటమి నేతల ప్రత్యారోపణలతో పోలీసులు తాజా ప్రకటన చేశారు. శాంతి ర్యాలీల పేరుతో గోశాలను గుంపులుగా సందర్శించవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
గోశాల సందర్శించేందుకు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి ఎలాంటి ఆటంకాలు చెప్పలేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డిని గృహ నిర్భందం చేయలేదన్నారు. రాజకీయ నేతలు గుంపులుగా గోశాలకు వెళ్లరాదన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన గోశాల సందర్శించవచ్చని ఎస్పీ సూచించారు.