హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఆనవాళ్లు గుర్తించిన ఇక్రిశాట్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రంలో చిరుత సంచరిస్తోందని గుర్తించారు. సీసీ టీవీలు బోను ఏర్పాటు చేశారు. దీంతో చిరుత బోనులో చిక్కింది. బోనులో చిరుతను హైదరాబాద్ జూ పార్కుకు తరలించారు.