మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలకు ఉన్న కులం పేర్లు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దక్షిణ భారత సెంగుంట ముదలియార్ సంఘం నిర్వహించే విద్యా సంస్థల కేసులో న్యాయమూర్తి జస్టిస్ భరత చక్రవర్తి విచారణ జరిపారు. ఉపాధ్యాయులు కులాల లేవని పిల్లలకు పాఠాలు చెబుతారని ఇందుకు భిన్నంగా విద్యా సంస్థల పేరులో మాత్రం కులం ఉంటుందని వారు గుర్తించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కులాల పేరుతో సంఘాలను కూడా నమోదు చేయవద్దని రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. పాఠశాలలు, కాలేజీలకు కులం పేర్లు పెట్టారని వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ఆయా విద్యా సంస్థలకు నోటీసులు పంపించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అందుకు వారు నిరాకరిస్తే గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించారు. అందులోని విద్యార్థులు వేరే సంస్థలకు మార్చాలని సూచించింది. ప్రభుత్వం నిర్వహించే కులాల సంక్షేమ పాఠశాలలకు కూడా కులం పేర్లు ఉండరాదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్