మెగా డీఎస్సీలో అధికారులు కీలక మార్పులు చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఏ,బీ విభాగాలుగా విభజించారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమశాఖ, ఏపీఆర్జేసీ యాజమాన్యాల ఎంపిక ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత పార్ట్ బిలో ధ్రువపత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసే వరకు ధ్రువపత్రాలు సమర్పించే అవకాశం కల్పిస్తారు. పదో తరగతి నుంచి బీఈడీ వరకు అన్ని ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
న్యాయ వివాదాలకు తావు లేకుండా త్వరగా డీఎస్సీ పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో డీఎస్సీ పూర్తి చేసిన తర్వాత యాజమాన్యాల ఎంపిక ఉండేది. దీని వల్ల పలు వివాదాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వివాదాలు లేకుండా, త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఈ మార్పులు చేశారు. అభ్యర్థులు ఇచ్చే ఐచ్ఛికాలకు ర్యాంకుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్