సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌ని ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా నామినేట్ చేసారు. తన తర్వాత 52వ సీజేఐ నియామకం కోసం బీఆర్ గవాయ్ పేరును పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి సంజీవ్ ఖన్నా లేఖ రాసారు.
సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. ఆయన దగ్గర దగ్గర ఏడు నెలలు మాత్రమే సీజేఐ పదవిలో ఉన్నారు. సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్‌గా ఉన్నది బిఆర్ గవాయే. ఆయన సీజేఐ అయినప్పటికీ ఆయన కూడా ఆరు నెలలకు మించి పదవిలో ఉండబోరు. బీఆర్ గవాయ్ ఈ యేడాది నవంబర్ 23న రిటైర్ అవుతారు.
గవాయ్ ఒకవేళ సీజేఐ అయితే, ఆ పదవిని అలంకరించిన షెడ్యూల్డు కులాలకు చెందిన రెండో వ్యక్తి అవుతారు. 2010లో రిటైర్ అయిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్, ఎస్సీ వర్గం నుంచి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అయిన వ్యక్తి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్