హైదరాబాద్ కంచ గచ్చిబౌలి కేసులో ఏఐ ద్వారా సృష్టించిన ఇమేజ్ను రీట్వీట్ చేసినందుకు ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పదుల సంఖ్యలో ఎర్త్ మూవింగ్ మెషిన్లతో నేలను చదును చేస్తుండగా రెండు జింకలు, ఒక నెమలి చూస్తూ వాపోతున్నట్లు కృత్రిమంగా ఒక చిత్రాన్ని తయారు చేసారు. దాన్ని గిబ్లీ ఆర్ట్‌లో మళ్ళీ రిక్రియేట్ చేసారు. ఆ చిత్రాన్ని స్మితా సభర్వాల్ రీట్వీట్ చేసారు. స్మితా సభర్వాల్ బీఆర్ఎస్ అనుకూల అధికారిణిగా పేరు పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఆమె తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.