ఊగిసలాట మధ్య కొట్టుమిట్టాడుతున్న స్టాక్ సూచీలు ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి. అమెరికా విధించిన ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు వాయిదా వేయడంతో స్టాక్ సూచీలకు ప్రతీకూల సంకేతాలు అందాయి. ఆసియా స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఐరోపా మార్కెట్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1500 పాయింట్లుపైగా లాభపడింది. నిఫ్టీ 500 పాయింట్లు పెరిగింది. బీఎస్ఈలో కంపెనీల విలువ ఒకే రోజు 8.7 లక్షల కోట్లు పెరిగి మొత్తం 410 లక్షల కోట్లకు చేరింది.
ఆసియా మార్కెట్ నుంచి అందిన సానుకూల సంకేతాలతో ప్రారంభంలోనే సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. చివరకు 1577 పాయింట్లు పెరిగి 76907 వద్ద ముగిసింది. నిఫ్టీ 500 పాయింట్లు పెరిగి, 23328 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి విలువ 85.77గా ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాలను చవిచూశాయి. టాటా మోటార్స్, ఇండస్ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ లాభాలను ఆర్జించాయి.ముడిచమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ 64 డాలర్లకు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగి ఔన్సు స్వచ్ఛమైన బంగార 3242 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.