సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో నూతన అసెంబ్లీ, రూ.786 కోట్లతో నూతన హైకోర్టు భవనాలు నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్ 1 బిడ్డర్‌కు నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయించింది.
స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. విశాఖ ఐటీహిల్స్ 3 వద్ద టీసీఎస్‌కు 21 ఎకరాలు లీజుకు కేటాయించారు. ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
క్లస్టర్ ఏర్పాటుకు ఉరుస కంపెనీకి కాపులుప్పాడ వద్ద 56 ఎకరాలు కేటాయించారు. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఒడిశా పవర్ కన్సార్టియంకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో 3500 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి