తిరుపతిలోని ఎస్వీ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు మృత్యువాతపడ్డాయంటూ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చర్యలకు సిద్దమైంది. టీడీపీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. భూమన కరుణాకర్‌రెడ్డి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అనిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో గోశాలను భ్రష్టు పట్టించారని టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో పురుగులు పట్టిన ఆహారాన్ని ఆవులకు అందించారని విమర్శించారు. వైసీపీ పాలనలో వందలాది ఆవులు చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గోవిందుడు, గోశాలతో ఆటలు ఆడవద్దని వైసీపీ నేతలకు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి