వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సెట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో మద్యం అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న మంగళగిరిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి నివాసాలపై సిట్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి కోసం గాలిస్తున్నారు.