కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. హర్యానాలో ఓ భూ ఒప్పందంలో వందల కోట్ల మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది.వాద్రా ఇవాళ నడుచుకుంటూ ఈడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు.
మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 8న తొలిసారి ఈడీ సమన్లు పంపింది. వాద్రా వాటిని పట్టించుకోలేదు. మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాళ ఇంటి నుంచి నడుచుకుంటూ ఈడీ కార్యాలయానికి వెళ్లిన వాద్రా, విచారణలో పాల్గొన్నారు.
ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి, వారు నన్ను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని వాద్రా అన్నారు. ఈ కేసులో ఏమీ లేదు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. ప్రజలు తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. అందుకే పాత సమస్యను తెరపైకి తెచ్చారు. 20 ఏళ్లలో నాకు 15 సమన్లు అందాయన్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి