వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల్లో అవినీతిపై కూటమి ప్రభుత్వం సిట్ విచారణ జరిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటోన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలపై సిట్ అధికారులు దాడులు నిర్వహించారు.విచారణకు రావాలంటూ మూడు సార్లు నోటీసులిచ్చినా రాజశేఖర్‌రెడ్డి పట్టించుకోకపోవడంతో, సిట్ అధికారులు దాడులకు దిగారు. తనకు ఏ ప్రాతిపదికన నోటీసులిస్తారంటూ సిట్ అధికారులను రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరించకుండా పరారు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి నివాసాలు, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలు, బినామీల ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మద్యంలో అవినీతి ద్వారా వచ్చిన సొమ్ములో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
అదనపు ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 పోలీసులు, తెలంగాణ పోలీసుల సాయంతో 15 చోట్ల ఏకకారంలో సోదాలు చేపట్టారు. సోమవారం మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పలు పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసున్నారు. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలతో సంబంధమున్న పలువురు వ్యక్తుల్ని పోలీసులు గుర్తించారు. వీరిని కూడా విచారణకు పిలవనున్నారు.
కసిరెడ్డికి చెందిన జూబ్లిహిల్స్, మంచిరేవుల్లోని నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన లేకపోవడంతో పనివాళ్ల నుంచి కొంత సమాచారం సేకరించారు. పనిమనుషులకు నోటీసులు అందించారు. కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి డైరెక్టరుగా ఉన్న హైదరాబాద్ రాయదుర్గంలోని అరెట్ ఆసుపత్రిలోనూ సిట్ అధికారులు సోదాలు చేశారు. రాజ్ కసిరెడ్డి కుమార్తె పేరిట నడుస్తోన్న ఇషానీ ఇన్‌ఫ్రాలోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ క్రియేషన్స్ పేరుతో సినిమాల్లో పెట్టుబడులపై కూడా ఆరా తీసారు. రాజ్ కసిరెడ్డి తోడల్లుడు అవినాష్ రెడ్డి నివాసంలోనూ సోదాలు చేశారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు