తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసే ఉద్యోగుల్లో 2 వేల మంది తమ నిఘా నేత్రాలని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమలలో ఎక్కడ ఏం జరిగినా తమకు సమాచారం ఇచ్చే వారు ఉన్నారని చెప్పారు. ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
టీటీడీ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లోనే వైరుధ్యం కనిపిస్తోందన్నారు. వందలాది గోవుల మరణాలు సంభవించాయంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో తమకు తెలుస్తుందన్నారు. గోవుల మృతికి బాధ్యత వహిస్తూ ఈవో, టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలని భూమన డిమాండ్ చేశారు.