అయోధ్యలోని రామాలయానికి మరింత రక్షణ కల్పిస్తున్నారు. దేవాలయం చుట్టూ 4 కి.మీ మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించినట్లు శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. రక్షణ గోడ నిర్మాణ పనులను ఇంజనీర్స్ ఇండియా సంస్థ చేపడుతోందన్నారు. డిజైన్లు, నాణ్యత, మట్టి పరీక్షలు జరిపిన తరవాత పనులు ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు.
అయోధ్య ఆలయ నిర్మాణ పనులు మరో 6 నెల్లల్లో అన్ని విధాలా పూర్తవుతాయని మిశ్ర చెప్పారు. లక్షలాది ప్రయాణీకుల కోసం పదెకరాల్లో 62 కౌంటర్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సప్త మండల ఆలయాల విగ్రహాలు జైపుర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నట్లు వెల్లడించారు.
అయోధ్య ఆలయానికి బెదిరింపులు వచ్చాయి. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆలయ పరిసరాల్లో భద్రత పెంచారు. దీనిపై అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రామాలయం గర్భగుడి శిఖరంపై భారీ కలశాన్ని ప్రతిష్ఠించారు. కలశ పూజా విధి నిర్వహించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తోన్న 6 దేవాలయాలపై కూడా కలశాలను ఏర్పాటు చేయనున్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి