అధ్యాయం 8 : జాతీయ దృష్టికోణం – 2
బొంబాయి నుంచి సింధ్‌ను విడదీయడానికి వ్యతిరేకం:
ముస్లిం నాయకులు అడిగారన్న ఒకేఒక కారణంతో బొంబాయి ప్రాంతం నుంచి ముస్లిములు ఎక్కువగా ఉండే సింధ్‌ను విడదీసి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయడాన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పట్లో దేశంలో ముస్లిం ప్రాంతాలను పెంచాలని ముస్లిం నాయకులు ఒత్తిడి చేస్తుండేవారు. శాసనసభల్లో ముస్లిములకు రిజర్వేషన్ల విషయంలో అంబేద్కర్ ‘‘ఏకపక్ష ఎన్నికలు, మతపరమైన సంరక్షణలు ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తాయి’’ అని స్పష్టంగా చెప్పాడు. (డా. బీఆర్ అంబేద్కర్ – వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ : 116వ పుట, రచన డా. డీఆర్ జాతవ్)
‘‘ముస్లింలీగ్ మతపరమైన విధానాలను జాతీయ దృష్టికోణంలో అంబేద్కర్ ఎంత వ్యతిరేకించారంటే కాంగ్రెస్ అంతగా ఎప్పుడూ వ్యతిరేకించలేదు’’ (డా. బీఆర్ అంబేద్కర్ – వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ : 116వ పుట, రచన డా. డీఆర్ జాతవ్)
ముస్లిం నాయకులు, ముస్లింలీగ్ పార్టీ దేశంలోని శాసనసభ, పార్లమెంటు స్థానాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కావాలంటూ చేసిన డిమాండ్లను కాంగ్రెస్ సమర్థించింది. బ్రిటిష్ వారు కూడా ఆ డిమాండ్‌ను అంగీకరించారు. ముస్లిం నేతలు మెల్లమెల్లగా తమ డిమాండ్లను పెంచుతూ పోయారు. చివరికి ఒకరోజు దేశాన్ని విభజించాలని కూడా డిమాండ్ చేసారు. దాంతో దేశం ముక్కలైపోయింది. అంబేద్కర్ చెప్పిన మాట నిజమని నిరూపితమైంది.
అల్పసంఖ్యాకులు కూడా దేశం అఖండత గురించి ఆలోచించాలి:
అంబేద్కర్ ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ‘‘ఈ దేశం వేర్వేరు జాతులు, మార్గాలుగా విడిపోయి ఉంది. అల్పసంఖ్యాకుల రక్షణకు అవసరమైన రాజ్యాంగ ఏర్పాటు చేయకుండా ఒక సంఘం స్వయంపాలిత సమాజంగా నిలబడలేదు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. కానీ అల్పసంఖ్యాకులు కూడా ఒక విషయాన్ని ధ్యాసలో ఉంచుకోవాలి. మనం వేర్వేరు జాతులకు వేర్వేరు మార్గాలకు చెందిన వారిగా విడివిడిగా ఉండి ఉండవచ్చు, కానీ మన లక్ష్యం అఖండ భారతదేశమే కావాలి. ఆ లక్ష్యానికి బాధ కలిగించే ఎలాంటి డిమాండ్‌నైనా అల్పసంఖ్యాకులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు’’ అని అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు.
విభజన వేళ దళితులపై ముస్లిముల అత్యాచారాలకు బాధపడిన అంబేద్కర్:
భారతదేశం విభజనకు గురైంది. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. హైదరాబాద్ పాలకుడు నిజాం భారతదేశంలో విలీనమవకూడదని భావించాడు. ఆ సమయంలో పాకిస్తాన్‌లోనూ, హైదరాబాద్ సంస్థానంలోనూ దళితులు, అస్పృశ్యుల పట్ల జరిగిన భయంకరమైన అత్యాచారాల సమాచారం అంబేద్కర్‌కు అందుతుండేది. పాకిస్తాన్లో దళితుల మీద ముస్లిములు పాల్పడిన అత్యాచారాలను విన్న అంబేద్కర్ గుండె మండిపోయింది. ఆయన ఆనాటి పత్రికలలో బహిరంగంగా ఇలా రాసాడు. ‘‘బలవంతంగా ముస్లిములుగా మార్చడం నుంచి తప్పించుకోడానికి మీరు ఎలా వీలైతే అలా భారతదేశానికి వచ్చేయండి. ముస్లిములకు సవర్ణ హిందువులంటే కోపం అని భావించి వారిని నమ్మకండి, వారిమీద భరోసా పెట్టుకోకండి. అలా చేస్తే మీరు అతిపెద్ద తప్పు చేసినట్లే.’’
పాకిస్తాన్‌లోనూ, హైదరాబాద్‌లోనూ హిందువులను బలవంతంగా ముస్లిములుగా మార్చేస్తున్నారు. అలా తమ జనాభా పెంచుకుంటున్నారు. అంబేద్కర్ తన ప్రకటనల్లో హైదరాబాద్ నిజామును భారతదేశ శత్రువుగా అభివర్ణించాడు. నిజాముకు ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలవవద్దని దళితులకు మార్గనిర్దేశనం చేసాడు. ఎక్కడెక్కడ హిందువులు ఉండిపోయారో వారిని అక్కడినుంచి తరలించడానికి తక్షణం ఏర్పాట్లు చేయాలని అంబేద్కర్ ఆనాటి ప్రధానమంత్రి జవాహర్లాల్ నెహ్రూకు చెప్పాడు. ఆ విషయాన్ని పత్రికలు కూడా ఘనంగా ప్రకటించి, సమర్థించాయి. (డా.భీమ్రావ్ అంబేద్కర్ : పుటలు 339-350, రచన డా. బ్రిజ్‌లాల్)
అఖండ భారతమే సత్యం:
‘‘ఇవాళ మనం రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా వేర్వేరు శిబిరాలుగా విడిపోయి ఉండవచ్చు. కానీ వేర్వేరు జాతులు, మార్గాలకు చెందినప్పటికీ మనమంతా ఒకే దేశంగా నిలబడగలమని నాకు పూర్తి నమ్మకముంది. దేశ విభజన కోరుతున్న ముస్లింలీగ్ కూడా తమ మేలు అఖండ హిందుస్తాన్లోనే ఉందన్న సంగతిని అర్ధం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది.’’
ఇస్లామిక్ సోదరభావం ప్రపంచ సోదరభావం కాదు:
ప్రపంచంలో ముస్లిములు వ్యవహరించే తీరు గురించి తెలిసిన ఏ తెలివైన విశ్లేషకుడైనా వారిగురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంబేద్కర్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఆయన ఇలా అంటాడు, ‘‘ముస్లిముల సోదరభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే సోదరభావం కాదు. వాళ్ళ సోదరభావం వారి మతం వరకే, వారి సమాజం వరకే పరిమితం. తమ మతానికి, తమ సమాజానికీ బైట ఉండేవారిని ముస్లిములు శత్రువులుగా భావిస్తారు. నిజమైన ముస్లిం ఎవరూ భారతదేశాన్ని తమ మాతృభూమిగా, హిందువులను తమ సోదరులుగా ఎన్నడూ భావించరు. అందువల్లే మౌలానా అలీ భారతీయుడైనప్పటికీ, తను మరణించిన తర్వాత తనను జెరూసలేంలోని శ్మశానంలో పాతిపెట్టాలని కోరుకున్నాడు.’’
(సశేషం)