అధ్యాయం 7 : జాతీయ దృష్టికోణం – 1
ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకం:
డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశంలో ఎవరికీ అన్యాయం జరగకూడదు. అదే సమయంలో ఎవరినీ సంతుష్టీకరణ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. ముస్లిముల డిమాండ్లు నానాటికీ పెరిగిపోతుండడం, వారిముందు సాగిలపడిపోయే కాంగ్రెస్ ధోరణి దేశానికి హానికరం. ముస్లిములకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా గాంధీ, కాంగ్రెస్ వారిని సంతుష్టీకరించే పద్ధతి అవలంబించారు. అంబేద్కర్ ముందున్న ప్రశ్న సమాజంలో వెనుకబడిన వర్గాల ఉద్ధరణ. ఒకవైపు పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని అడుగుతూనే అత్యధిక అధికారాల కోసం పట్టుపడుతున్న ముస్లిములు, మరోవైపు కాంగ్రెస్ వివాదాస్పద చరిత్ర. ముస్లిం సంతుష్టీకరణ విధానానికి వ్యతిరేకి ఐనందున అంబేద్కర్, ముస్లిములకు విధానసభల్లో సీట్ల రిజర్వేషన్ విధానాన్ని మొదటిసారి ఇచ్చిన లక్నో ఒప్పందాన్నీ, నెహ్రూ కమిటీ నివేదికనూ తీవ్రంగా వ్యతిరేకించాడు.
1929 జనవరి 19న ‘బహిష్కృత భారత్’ పత్రికకు రాసిన లేఖలో అంబేద్కర్ ఇలా రాసాడు, ‘‘ఏ ప్రణాళిక వల్ల హిందువులకు కీడు కలుగుతుందో అలాంటి ప్రణాళిక ఎందుకు పనికొస్తుంది? ఆ నివేదికను మేం వ్యతిరేకిస్తున్నది దేనికంటే అస్పృశ్యుల అధికారాలను హరిస్తున్నందుకు మాత్రమే కాదు, ఆ నివేదిక వల్ల హిందువులకు ప్రమాదం వాటిల్లుతుంది, దానివల్ల మొత్తం హిందుస్తాన్ భవిష్యత్తులో కష్టాల పాలవుతుంది. అందువల్లే ఆ నివేదికను మేం వ్యతిరేకిస్తున్నాం.’’
దేశ భద్రత విషయంలో:
1857 విప్లవం తర్వాత సైన్యంలో క్రమక్రమంగా ముస్లిముల శాతం పెరుగుతూ వచ్చింది. ఆ విషయంపై అంబేద్కర్ తీవ్ర ఆందోళన చెందాడు. భారత సైన్యంలో ముస్లిముల సంఖ్య పెరుగుతుండడంపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది, ‘‘ఇవాళ భారత సైన్యంలో ముస్లిములు సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో అత్యధికులు దేశ వాయవ్య ప్రాంతానికి చెందిన వారు. భారతదేశాన్ని ఆక్రమణల నుంచి రక్షించడానికి భారతీయులకు మాత్రమే బాధ్యత అప్పగించాలి. దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేయడానికి హిందువులు ఎంతకాలం ఈ పహరాదారులపై ఆధారపడతారు?’’ (థాట్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో)
అప్పట్లో భారత సరిహద్దుల్లో పెద్ద ముస్లిం దేశం అఫ్గానిస్తాన్ ఉండేది. ముస్లిముల మానసిక ప్రవృత్తిని గుర్తించిన అంబేద్కర్ ఇలా రాసారు ‘‘అఫ్గానిస్తాన్ స్వయంగా కానీ, ఇతర ముస్లిం దేశాలతో కానీ కలిసి భారతదేశంపై దాడికి దిగితే, ఈ ముస్లిం సైనికులు ఏం చేస్తారు? వీరు వారిని ప్రతిఘటిస్తారా లేక దేశంలోకి దారులు తెరిచిపెడతారా? ఈ ప్రశ్న విషయంలో ఏ హిందువూ ప్రశాంతంగా, నిర్వికారంగా ఉండలేడు. ప్రతీ హిందువుకూ ఈ ప్రశ్నకు సంతోషకరమైన జవాబు కావాలి. ముస్లిములు తమ మాతృభూమి పట్ల విధేయంగా ఉంటారా లేక ఇమాముల పిలుపు మేరకు మరో దారిని ఎంచుకుంటారా?’’ (థాట్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో)
‘‘ప్రశ్న అదే. దేశ భద్రత విషయంలో అలాంటి సైన్యం పట్ల మనం భరోసా కలిగి ఉండగలమా? ముస్లిములు హిందువులను కాఫిర్లుగా భావిస్తారు. హిందువులను రక్షించాలన్న భావనను తొలగించివేయడమే వారి
ఉద్దేశంలో శ్రేయస్కరమైన మార్గం. హిందూ అధికారుల అధీనంలో ఉన్నప్పటికీ ముస్లిముల ఈ
రెజిమెంట్ ఎలా పని చేస్తుందన్నది అనుమానాస్పదమే.’’ అంబేద్కర్ 1919ని గుర్తు చేసుకుంటూ ఇంకా ఇలా రాసాడు ‘‘గుర్తు చేసుకోండి. ఖిలాఫత్ ఉద్యమం జరుగుతున్న సమయంలో భారతదేశపు ముస్లిములు అఫ్గానిస్తాన్ అమీరులను మా దేశాన్ని ఆక్రమించుకోండని ఆహ్వానించారు.’’ (థాట్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో)
ఖిలాఫత్ ఉద్యమానికి వ్యతిరేకం:
టర్కీలో ఖలీఫా (ఇస్లామిక్ పరిపాలన) ముగిసిపోడానికి వ్యతిరేకంగా, భారతదేశంలో కాంగ్రెస్ ఉద్యమం చేసింది. నిజానికి భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అదే సమయంలో దేశానికి సంబంధించిన మతపరమైన విషయాల మీద మొత్తం దేశాన్ని పణంగా పెట్టడం కాంగ్రెస్ తీసుకున్న అతిపెద్ద మూర్ఖపు చర్య. ఆ విషయంలో అంబేద్కర్ అభిప్రాయాన్ని మధు లిమయే ఇలా రాసాడు, ‘‘ఖిలాఫత్ ఉద్యమం మీద డాక్టర్ అంబేద్కర్‌కు ఎలాంటి సానుభూతీ లేదు. ఈ విషయంలో గాంధీ ప్రవర్తన గురించి అంబేద్కర్ ఏమనుకున్నారంటే గాంధీ ఆ ఉద్యమానికి కేవలం సమర్థన మాత్రమే ఇవ్వలేదు. వారికి మిత్రులు, మార్గదర్శకులుగా కూడా నిలిచారు. గాంధీ ఉద్దేశంలో సుల్తాన్ ఖలీఫాను అనుసరించకూడదని టర్కీవాసులపై ఒత్తిడి చేయడం ఎంతమాత్రం సరైనది కాదు.’’ (డా. బీఆర్ అంబేద్కర్ – ఏక్ చింతన్ : మధు లిమయే)
(సశేషం)
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి