రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులో ఎక్కిన ఇద్దరు చిన్నారులు లాక్ పడటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బంధువుల వివాహానికి వచ్చిన అక్కచెల్లెళ్లు తన్మయశ్రీ, అభినయశ్రీ ఆడుకుంటూ ఇంటిముందు ఉన్న కారులోకి ఎక్కారు. కారు డోర్లు లాక్ అయ్యాయి. ఎవరూ గమనించలేదు. కారులో
ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
పిల్లలు ఎంతకూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో వెతకడం ప్రారంభించారు. చివరకు కారులో అపస్మారక స్థితిలో చిన్నారులను గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారు అప్పటికే మరణించారని డాక్టర్లు చెప్పారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి