చిత్తూరు మసీదుమిట్టకు చెందిన యువత యాస్మిన్‌బాను ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే అనుమానాస్పదంగా మృతిచెందింది. తల్లిదండ్రులు సహజ మరణం అని చెబుతున్నా, ప్రియుడు సాయితేజ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
చిత్తూరు నగరం మసీదుమిట్టకు చెందిన యాస్మిన్‌భాను, ఏప్రిల్ 9న సాయితేజ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. తరువాత వారు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. వారు మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజతో పంపించారు.
తండ్రి ఆరోగ్యం విషమించిందని యాస్మిన్ భానును ఆదివారం ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో గత రాత్రి ఆమె చనిపోయినట్లు సాయితేజకు సమాచారం అందించారు. యాస్మిన్ తల్లిదండ్రులే హతమార్చారని సాయితేజ ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి