గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 13 అర్థరాత్రి ఓ పడవ కదలికలు అనుమానంగా ఉండటంతో తీర రక్షక దళం అక్కడకు చేరుకుంది. కోస్ట్ గార్డ్ దళాలు వస్తున్నట్లు గమనించిన స్మగ్లర్లు డ్రగ్స్ ఉన్న సంచులను సముద్రంలో వేసి పారిపోయారు. నావీ దళాలు గాలించి సముద్రంలో విసిరిన డ్రగ్స్ వెలికితీశాయి. అందులో 300 కిలోల మెథాంఫేటమిన్ మత్తు పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ మార్కెట్లో రూ.1800 కోట్లు ఉంటుందని అంచనా.
గుజరాత్ తీరంలో కోస్ట్‌గార్డ్ దళాలు ఇటీవల పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ గుజరాత్ తీరానికి తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గుజరాత్ తీరానికి తరలించి అక్కడ నుంచి ఢిల్లీ, పంజాబ్, ముంబై వేరవేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్