అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి చేశారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
గాయపడిన వారిలో ఇద్దరిని విశాఖలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి విశాఖ జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరికి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి