ఒడిషాలోని పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయ శిఖరంపైనున్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద తన్నుకెళ్లింది. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసి కొందరు విస్మయానికి గురయ్యారు.
పూరీకి వచ్చే భక్తులు తొలుత పతితపావన జెండా దర్శనం చేసుకుని, చేతులెత్తి మొక్కుతారు. ఆ తరవాతే ఆలయంలోని జగన్నాథ దర్శనం చేసుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు జెండా మారుస్తారు. భక్తులు సమర్పించే జెండాలు చక్ర దిగువన ఉంచుతారు. ఆపైన 14 మూరల పతాకం ఎగురుతూ ఉంటుంది. గద్ద జెండాను
తీసుకెళ్లడాన్ని జనం వింతగా చెప్పుకుంటున్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి