ప్రభుత్వ కార్యాలయాలపై సౌరవెలుగులకు రంగం సిద్దమైంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. 496 ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో మొదటి విడతలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా 147 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ కార్యాలయాలు, జూనియర్ కాలేజీలను ఎన్టీపీసీ అధికారులు పరిశీలించారు. కనీసం 150 కిలోవాట్ల సామర్థ్యంతో ఒక్కో భవనంపై ప్యానెళ్లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరవాత 50కిలోవాట్ సామర్థ్యం ఉన్న ప్యానళ్ల ద్వారా కూడా సౌర విద్యుత్ ప్లాంటు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ప్రభుత్వ కార్యాలయాలు పగటి సమయంలో ఎక్కువగా పనిచేస్తాయి. ఇందుకు ప్రభుత్వం ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.8 చెల్లిస్తోంది. సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే ఒక్కో యూనిట్ విద్యుత్ రూ.4కే లభ్యం కానుంది. దీని ద్వారా ప్రభుత్వానికి విద్యుత్ బిల్లుల వ్యయం సగం తగ్గుతుంది.
రెస్కో విధానంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సౌర ఫలకాల ఏర్పాటు చేయడంతోపాటు, 25 సంవత్సరాలపాటు నిర్వహణ కూడా రెస్కో సంస్థ చూసుకుంటుంది. దీని ద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గనుంది.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి