తిరుమల తిరుపతిపై వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని హోం మంత్రి అనిత విమర్శించారు. తిరుమల ఎస్వీ గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయంటూ భూమన చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి ఖండించారు. అసత్య ప్రచారాలు చేసి తిరుమల తిరుపతి ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్వీ గోశాల నిర్వహణకు 260 మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసినట్లు చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మళ్లించిన కరుణాకర్‌రెడ్డి కమీషన్లు దండుకున్నారని హోం మంత్రి అనిత దుయ్యబట్టారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించి, ఏడు కొండలను ఐదు కొండలుగా మార్చేందుకు భూమన కుట్ర పన్నాడని విమర్శించారు. గోశాలలో వందలాది గోవులు చనిపోయాయంటూ భూమన చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హెచ్చరించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్