వైద్య విద్యార్థులు పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడ్డారు. విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో జరుగుతోన్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. బుధవారం నాడు మాల్ ప్రాక్టీస్ చేస్తూ ముగ్గురు విద్యార్ధులు దొరికిపోయారు. తాజాగా మరో ఇద్దరిని స్క్వాడ్ పట్టుకుంది.
యూనివర్సిటీ స్పెషల్ స్క్వాడ్ తనిణీలు నిర్వహించగా స్లిప్పులతో ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. విద్యార్థుల గుర్తింపుకార్డులు, జవాబు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ కమిటీకి అధికారులు నివేదిక పంపించారు. మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన వారు ఎన్నారై, నిమ్రా వైద్య విద్యార్ధులుగా గుర్తించారు. మొత్తం 160 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఏప్రిల్ 21 వరకు పరీక్షలు జరగనున్నాయి.