ముంబై విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టివేశారు. తాజాగా ఓ ప్రయాణీకుడి నుంచి 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 6.3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమాన ప్రయాణీకుడి వద్ద నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం.
బ్యాంకాక్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో ఓ ప్రయాణీకుడి ప్రవర్తనపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రయాణీకుడిని తనిఖీ చేయగా బంగారం వెలుగు చూసింది. అనుమానాస్పద ప్రయాణీకుడి బూట్లలో బంగారు కడ్డీలను ( #goldbars) గుర్తించారు. బ్యాంకాక్ నుంచి బంగారం తీసుకువచ్చి అమ్మడానికి ప్రయత్నం చేసినట్లు ఆ ప్రయాణీకుడు వెల్లడించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.