వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌లో నిరసనలు మిన్నంటాయి. శుక్రవారం మొదలైన హింస నాలుగు జిల్లాలకు విస్తరించింది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్, మాల్దా, 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాల్లో శుక్రవారం నుంచి హింస చెలరేగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో పది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హింసకు పాల్పడిన 110 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగాల్‌లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఒకప్పుడు పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్ కలిసే ఉండేవన్నారు. ముస్లింల ఆస్తులను కాపాడుతామని సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.
బెంగాల్‌లో శాంతిభద్రతలు విఫలం అయ్యాయని బీజేపీ నేతలు విమర్శించారు. సమాజంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. హింసను అదుపు చేయడం సాధ్యం కాకపోతే కేంద్ర సాయం తీసుకోవాలని బీజేపీ నేతలు సూచించారు.