నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్‌తో కార్మికులు పరుగులు తీశారు. జిల్లాలోని టీపీగూడూరు మండలం అనంతపురం గ్రామంలో వాటర్‌బేస్ అనే కంపెనీలో అమోనియా గ్యాస్ లీకుతో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా గ్యాస్ వ్యాపించింది. జనం ఊపిరాడక ఆందోళన చెందారు. కొందరు బాధితులు వారికి అందుబాటులో ఉన్న మస్కులు ధరించారు.