డిజిటల్ చెల్లింపుల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు యూపీఐ చెల్లింపులు సరిగా పనిచేయడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు మొదలు పెట్టారు. వేలాది మంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్చి 26వ తేదీ కూడా గూగుల్ పే, ఫోన్ పేలాంటి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయని ప్రకటించారు. 2 గంటల వ్యవధి తరవాత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
డిజిటల్ పేమెంట్ల సేవల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నెలకు 1800 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. వీటి సంఖ్య ఇంకా పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ వినియోగం తగ్గించండం ద్వారా ముద్రణ ఖర్చులు తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ పేమెంట్ల ద్వారా పారదర్శకత కూడా పెరుగుతుందని కేంద్రం యోచిస్తోంది.