దేశంలో ఉగ్రదాడులకు అవకాశ ముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబైపై దాడి కేసులో ఉగ్రవాది తహవ్వుర్ రాణాను భారత్కు తరలించిన క్రమంలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాదులు పేట్రేగిపోయే ప్రమాదముందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. నదీ మార్గాల ద్వారా దేశంలోకి చొరబడే అవకాశముందన్నారు. రైల్వే శాఖను అప్రమత్తం చేశారు. ఎల్ఈడీ పేలుడు పదార్థాల ద్వారా విధ్వంసం సృషించే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.
2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు పడవల ద్వారా ముంబై చేరుకుని విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు తాజ్ హోటల్, ట్రైడెండ్ హోటల్, ప్రధాన రైల్వే స్టేషన్లలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 166 మంది పౌరుల ప్రాణాలు తీశారు. ఉగ్రవాదుల ఏరివేతలో 18 మంది పోలీసులు కూడా అమరులయ్యారు.