ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి ఏడాదిలో 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాది 83 శాతం మంది పాసయ్యారు. ఐదేళ్లలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కళశాలలు, ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేసిన అధ్యాపకులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
ఇంటర్మీడియట్ తొలి ఏడాది ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో 93 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. తొలి ఏడాది ఫలితాల్లో చిత్తూరు జిల్లా 54 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.