ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు.
మొదటి, రెండవ సంవత్సర ఇంటర్ ఫలితాలను వాట్సప్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు మనమిత్ర వాట్సప్ నెంబరు 9552300009 ద్వారా కూడా పొందవచ్చు. మార్కుల షార్ట్ మెమోలను కూడా అందుబాటులో ఉంచారు.