తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం గుర్తించారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు ముగ్గురు భక్తులు పాదరక్షలతో ప్రవేశించారు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించి, వారిని అక్కడే అడ్డుకున్నారు. క్యూ కాంప్లెక్సులో భక్తులను రెండంచెల్లో తనిఖీ చేసిన సిబ్బంది, విధుల్లో విఫలం కావడంతో వారు ఆలయ మహాద్వారం వరకు రాగలిగారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.
గత నెలలోనూ అలిపిరి గేటు వద్ద తనిఖీలను తప్పించుకుని ఓ ముస్లిం వ్యక్తి బైకుతో ఘాటు రోడ్డులో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. విచారించిన సిబ్బంది అతని మానసిక పరిస్థితి సక్రమంగా లేదని తేల్చారు.