కోటి మొక్కులుపైగా నాటిన పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లెలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య మరణించారు. జీవితాంతం మొక్కలు నాటి భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 85 సంవత్సరాల రామయ్య తన జీవిత కాలంలో కోటి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించి రహదారుల వెంట పచ్చదనం నింపారు.
వనజీవి రామయ్య మరణ వార్త విని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామయ్య భావి తరాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. రామయ్య మరణ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరూ స్పందించారు. వనజీవి రామయ్య మరణం పర్యావరణానికి తీరని లోటన్నారు. రామయ్య మరణంతో దేశం గొప్ప పర్యావరణ వేత్తను కోల్పోయిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
వనజీవి రామయ్య మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. జీవితాంతం మొక్కలు నాటిని ఏకైక వ్యక్తి రామయ్యా అని కొనియాడారు.