బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. అంతర్జాతీయగా అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో బంగారంలో పెట్టుబడులు సురక్షితంగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలతో స్టాక్ సూచీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. పెట్టుబడిదారులు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ధరలు దూసుకుపోతున్నారు.
తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 2 వేలకుపైగా పెరిగి 96800 జీవితకాల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పైపైకి పాకుతోంది. శుక్రవారం బులియన్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి ఔన్సు బంగారం 3230 డాలర్లకు ఎగబాకింది. ఒకే రోజు 70 డాలర్లు పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు తీసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 96800 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి 97 వేలకు చేరింది. ముడిచమురు ధరలు దిగి వచ్చాయి. బ్యారెల్ క్రూడాయిల్ 63 డాలర్లకు తగ్గింది. రూపాయి మారకం విలువలో పెద్దగా మార్పులు లేవు. డాలరు విలువతో పోల్చినప్పుడు రూపాయి విలువ 86.15గా ఉంది.