రామరాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం వైభవంగా ముగిసింది. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. సీఎం దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. శ్రీరాముడు, సీతమ్మ వారిది ఆదర్శ దాంపత్యమని సీఎం అన్నారు. పాలన అంటే శ్రీరాముడు గుర్తుకు రావాలని తెలిపారు. రాష్ట్రం విడిపోకముందు భద్రచలంలో రాముల వారిని దర్శనం చేసుకునేవాళ్లమని, అక్కడే వైభవంగా కల్యాణం జరిపేవారిమన్నారు. విభజన తరవాత ఒంటిమిట్టలో అంత్యంత వైభవంగా స్వామి వారి కల్యాణం జరిపించాలని ఆదేశాలు జారీచేసినట్లు గుర్తుచేశారు.
ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు అప్పగించి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. భక్తులు రెండు,మూడు రోజులు ఉండేలా సదుపాయాలు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాలు మన వారసత్వ సంపదని గుర్తు చేశారు. దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ లేదన్నారు.ప్రపంచంలో ఏ దేశానికి లేని వారసత్వ సంపద భారత్ సొంతమన్నారు. వారసత్వ సంపద భవిష్యత్ తరాలకు అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత