బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ విషయంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు సమయం కోరడంతో విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఏప్రిల్ 27న ఎల్కతుర్తి గ్రామం దగ్గర ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకోడానికి బీఆర్ఎస్ అనుమతి కోరింది. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో సభకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ పోలీస్ కమిషనర్, కాజీపేట ఏసీపీలను ప్రతివాదులుగా చేరుస్తూ కేసు నమోదు చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని హోంశాఖ అధికారులు అభ్యర్ధించారు. న్యాయస్థానం ఈ నెల 17వరకూ సమయం ఇచ్చి, అంతవరకూ విచారణ వాయిదా వేసింది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత