పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. తాజా దాడుల్లో హమాస్ ఉగ్రనేత స్నైపర్ ఫోర్స్ కమాండర్ అహ్మద్ ఐయాద్ మహమ్మద్ ఫర్హాత్ హతమయ్యాడని ఐడీఎఫ్ వెల్లడించింది. గురువారం ఇజ్రాయెల్ సైన్యం విమానాలు, డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా హమాస్ కీలక స్థావరాలపై దాడులు జరిపింది. హమాస్ ఉగ్రవాదులకు చెందిన 40 స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఐడీఎఫ్ దాడుల్లో హతమైన అహ్మద్ ఐయాద్ మహమ్మద్ ఫర్హాత్ ఇజ్రాయెల్‌పై దాడులకు పథక రచన చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టడంతో మరో విజయం సాధించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. పాలస్తీనాలోని రఫా, ఖాన్ యూనిస్, మొరాగ్ కారిడార్ ప్రాంతాల్లో ఐడీఎఫ్ దళాలు దాడి చేయగా పలువురు హమాస్ ఉగ్రవాదులు కూడా మృతిచెందినట్లు ప్రకటించారు. పాలస్తీనాలోని 50 శాతం భూభాగం తమ అధీనంలోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. పాలస్తీనా మొత్తం ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత