తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలలలో వంద ఆవులు మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఎస్వీ గోశాలలో ఆవులు మృత్యువాత పడ్డాయంటూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రచారం చేయడం దారుణమన్నారు.
ఎస్వీ గోశాలలో వంద ఆవులు బక్కచిక్కి, మృత్యువాత పడ్డాయంటూ కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. శ్రీవారి భక్తులు అసత్యాలు నమ్మవద్దని చెప్పారు. ఎస్వీ గోశాలలో గోవులన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. కరుణాకర్‌రెడ్డి గోశాలకు వస్తే ఆవులను చూపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టేందుకే భూమన కరుణాకర్‌రెడ్డి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఐదేళ వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని దుయ్యబట్టారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత