తమిళనాడు అటవీ మంత్రి కె.పొన్ముడి మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మహిళలపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో అధికార డీఎంకె దిద్దుబాటు చర్యలకు సిద్దమైంది.
ఓ సమావేశంలో మంత్రి పొన్ముడి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో సెక్స్ వర్కర్లకు, విటులకు మధ్య జరిగే సంభాషణ ఇలా ఉంటుందంటూ రాయడానికి వీల్లేని అసభ్య పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. ఆ తరవాత ఇదంతా జోక్ అంటూ ఆయన మాట్లాడిన తీరు మహిళలను కించపరిచేదిగా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నటి, బీజేపీ నాయకురాలు ఖష్భూ సుందర్ మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్ముడిని మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో డీఎంకె పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత