వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ తాడిగడపలోని సీఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వైసీపీ పాలనలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని జోగి రమేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. కేసులో వివరాలు ఇవ్వాలని కోరింది.
2021లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు చెందిన ఉండవల్లి నివాసంపై దాడి ఘటనపై పోలీసు కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత