అంగన్వాడీల్లోని చిన్నారులకు పౌష్టిక, రుచికరమైన ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసింది. వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వనున్నారు. ఓ రోజు ఉడికించిన శనగలు అందిస్తారు. అన్ని కూరలు, పప్పులో మునగ పొడి తప్పనిసరి చేశారు. బాలామృతంలో చక్కెర తగ్గించారు. ఫైలెట్ ప్రాజెక్టు కింద ఏలూరు, విశాఖ, ఒంగోలు, కర్నూలు జోన్లలో ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ఫైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. 26 జిల్లాల్లో రాబోయే నెల రోజుల్లో ఒక్కో కేంద్రంలో ఫైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. నెల రోజులు అమలు చేసిన తరవాత చిన్నారులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.
బాలామృతంలో పోషక విలువలు పెంచేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్, యునిసెఫ్, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, టాటా ట్రస్టు, మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందంతో కమిటీ వేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు పోషకాహారంపై చర్చలు జరిపారు. వారి సూచనల ఆధారంగా చక్కెర తగ్గించి పోషకాలు పెంచాలని నిర్ణయించారు. గోధుమపిండి, పెసరపప్పు, వేరుశనగ పొడి, శనగల పొడి కలిపి బాలామృతం తయారు చేయనున్నారు. ఇందులో చక్కెర లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చక్కెర లేదా బెల్లం కలపాలని చిన్నారుల తల్లిదండ్రులు సూచనలు చేశారు.
బాలామృతం పిండిలో వేరుశనగ పిండి కలపడం వల్ల వాసన వస్తోందని, జీలకర్ర కలిపితే అది తగ్గుతుందని కొందరు సలహాలు అందించారు. కొందరు చక్కెర వద్దని సూచించారు. ఆరు నెలల చిన్నారుల నుంచి మూడేళ్ల వయసు వారికి బాలామృతం అందిస్తున్నారు. దాన్ని ప్రస్తుతం రెండు విభాగాలు చేశారు. 7 నుంచి 12 నెలల చిన్నారులను జూనియర్‌గా, 13 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులను సీనియర్‌గా పరిగణిస్తారు. అందించాల్సిన పోషకాల్లో మార్పులు చేస్తారు. ఈ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత