రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విశాఖలో భూములు కేటాయించినప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధలను ఉల్లంఘించడంతో జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ షోకాజ్ నోటీజు జారీ చేసారు. నోటీసులు అందుకున్న పది రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే బీఎస్ఓ ప్రకారం అంటే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్ 24 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. విశాఖలో స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం రామానాయుడు సంస్థకు 34.4 ఎకరాలు కేటాయించింది. కొంత భూమిలో స్టూడియో నిర్మాణాలు చేసారు. మరికొంత భూమిలో లే అవుట్ చేసి ఫ్లాట్లు అమ్మకం మొదలు పెట్టారు. స్టూడియోకు భూములు తీసుకుని లే అవుట్ వేసి అమ్మడంపై స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత