బడిలో అరాచకం వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి జిల్లా ధరవరంలోని ప్రైవేటు బడిలో విద్యార్థులు హోం వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టడం తీవ్ర కలకలం రేగింది. ధర్మవరం జీనియస్ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండో తరగతి చదువుతోన్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయలేదని వారిపై ఆగ్రహం చెందిన ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
విద్యార్ధుల తల్లిదండ్రులు జీనియస్ పాఠశాల వద్దకు చేరుకుని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయురాలిపై దాడికి దిగారు. పిల్లలకు చదువులు చెప్పాల్సిన టీచర్, చెప్పుతో కొట్టడం ఏంటని వారు యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాల వద్ద తీవ్ర గందరగోళం నెలకొనడంతో ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకు దిగిన వారికి నచ్చచెప్పారు. పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని ఎంఈవో గోపాల్ నాయక్ వెల్లడించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత