అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. పరస్పర సుంకాల పెంపు, బర్డ్ ఫ్లూ ప్రభావంతో అమెరికాలో కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. తాజాగా డజను గుడ్లు రూ.536కు చేరాయి. 2023 ఆగష్టులో డజను గుడ్ల ధర రూ.175 కాగా, ఈ ఏడాది మార్చి నాటికి రూ.536కు చేరాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టినా, టోకు ధరల సూచి నెమ్మదించినా పరిస్థితిలో మార్పు రాలేదు.
అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఈస్టర్ పండగ నాటికి అంటే ఏప్రిల్ 20 నాటికి పెరుగుతుంటాయి. బర్డ్ ఫ్లూ కారణంగా 3 కోట్ల గుడ్లను నాశనం చేశారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికాలో 17 కోట్ల కోళ్లను వధించారు. వీటిలో ఎక్కువగా గుడ్లు పెట్టే కోళ్లు ఉన్నాయి. తాజాగా పెంపకం చేపట్టిన కోళ్లు నుంచి గుడ్ల ఉత్పత్తి కావడానికి మరో 2 నెలల సమయం పట్టనుంది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత