తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. మధ్యాహ్నం కురుసిన వర్షానికి మియాపూర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, ఎస్ఆర్నగర్, మేడ్చల్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏప్రిల్ 11న తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. 12వ తేదీ సంగారెడ్డి,మహబూబ్నగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు వడగండ్లు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మండుతున్న ఎండలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో హైదరాబాద్ నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత